మొబైల్ ఫోన్ ధరలు తగ్గే ఛాన్స్... !!

మొబైల్ ఫోన్ల తయారీపై కేంద్రం ఫోకస్ చేసింది. భారతదేశంలోనే ఫోన్ల తయారీని ప్రోత్సహించాలని టెలి కమ్యూనికేషన్ డిపార్టుమెంటు (డాట్) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికోసం కంపెనీలకు దాదాపు 15 ఏళ్ల పాటు పన్ను మినహాహింపు ఇవ్వాలని, వ్యాట్ ను కూడా తగ్గించాలని టెలి కమ్యూనికేషన్ డిపార్టుమెంటు ప్రతిపాదించింది. ఇప్పుడు 8.8-15 % ఉన్న వ్యాట్ ను 4 - 5 % వరకు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. అట్లనే , ఇన్వెస్ట్ మెంట్స్ పై పన్ను పయోజనాలను కల్పించేలా Income Tax చట్టంలోని 35 AD పరిధిలోకి  Mobile Phones, Tablets తయారీ సంస్థలను తీసుకురావాలని కోరింది. దీనితో, Mobile ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ పార్టులు చెప్తున్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form