ఆంధ్రప్రదేశ్ :అనంతపురంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.ఈ రోజు ఉదయం ఆర్టిసి పల్లె వెలుగు బస్సు (AP 28 Z 1053) మడకశిర నుంచి పెనుగొండ వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు . స్కూల్ కి కాలేజీకి వెళ్లే సమయం కావడంతో మృతుల్లో విద్యార్థులు ఉన్నారు. బస్సులో మొత్తం 60 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్షసాక్షలు చెప్పారు. బస్సు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెనుగొండ, హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు తరలించారు.
Tags
Politics
