నగరంలో మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం షీ టాక్సీ లని నడపాలని నిర్ణయించింది.అమ్మాయిలు, స్త్రీ ప్రయాణికుల భద్రత కోసం ‘షీ టాక్సీ’ స్కీంను త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయనుంది.ప్రభుత్వం దాదాపు 35శాతం డిస్కౌంట్ తో మహిళా డ్రైవర్లకు ‘షీ టాక్సీ’ ను అందిస్తారు. ముందు ఓ 50 టాక్సీలను అందించాలని ప్రతిపాదించింది.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీనే స్కీంను మానిటర్ చేయనుంది. ‘షీ టాక్సీ’ నడిపే వారికి నెలరోజుల్లో లైసెన్స్ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది.
