ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొనడానికి తెలంగాణ శకటానికి కేంద్రం నుంచి అనుమతిని ఇచ్చింది . వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం నలబై (40) శకటాల ప్రతిపాదనలు రాగా అందులో నుంచి కేవలం పదమూడు (13) శకటాలకు మాత్రమే కేంద్రం అనుమతిని ఇచ్చింది. రక్షణ శాఖ ప్రకటించిన మొదట ప్రకటించిన లిస్టులో తెలంగాణ శకటం లేకపోవడంతో, ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ పారికార్, అరుణ్ జైట్లీ లను కలిసారు. సానుకూలంగా స్పందించిన కేంద్రం, రాష్ట్ర శకటానికి అనుమతి ఇచ్చింది.