Venkatesh next movie heroine Kajal


గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకి, ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో "బాబు బంగారం" అనే సినిమాలో నటిస్తున్నాడు. "భలే భలే మగాడివోయ్" సినిమా విజయం తో  మంచి ఫాంలో ఉన్న మారుతి, ఫుల్‑లెంగ్త్ కామెడీ రోల్లో వెంకి ని చూపించనున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే, వెంకి తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్‑లో పెడుతున్నాడు.

"బాబు బంగారం" సినిమా పూర్తయిన వెంటనే నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమాకు చేయబోతున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ చిత్రం ను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. మల్టీ డైమెన్షన్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో వెంకి కి జోడిగా కాజల్ అగర్వాల్  నటించనుంది. ఇప్పటి వరకు యువ హీరోలతో మాత్రమే జోడి కట్టిన కాజల్ తొలిసారిగా ఓ సీనియర్ హీరోతో నటిస్తున్నందుకు భారీ మొత్తాన్నే తీసుకుంటున్నదని టాక్ వినిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post

Contact Form