How to track a phone - locate a lost Android
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగిలించారా? ఎక్కడో పెట్టి మరిచిపోయారా? అయితే, మీ ఫోన్ ఎక్కడుందో గూగుల్ సెర్చ్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు ! ఎలాగంటే..
మీ ఫోన్‌లో గతంలో రిజిస్టర్ చేసుకున్న "G-mail" అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
గూగుల్ సెర్చ్ Home Pageకి వెళ్లి ‘Where is My Phone ?’ అని టైప్ చేయండి.
గూగుల్ మ్యాపు, మ్యాపుపై బాక్స్ కనిపిస్తుంది. బాక్స్ లో ‘Locate Phone’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మ్యాపుపై మీ ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. ‘Ring' ఆప్షన్‌ను ఎంచుకోండి.
మీ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా పూర్తి వాల్యూమ్‌తో 5 నిమిషాలు మోగుతుంది. బాక్స్ లోని ‘Enable Lock and Erase’ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త పాస్‌వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి. దయచేసి ఈ ఫోన్‌ను ఫలానా చోట తిరిగి ఇచ్చేయండి.. అంటూ పోయిన ఫోన్ లాక్ స్ర్కీన్‌పై కనిపించేలా మెసేజ్, కొత్త ఫోన్ నెంబర్‌నూ పంపొచ్చు.
మీ ఫోన్‌లో Internet ఉంటేనే ఫోన్ లొకేట్ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్‌లైన్‌ల ఉందో కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్స్ కి మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే.
