Ali Controversial Comments on Kajal
అనుష్క తొడలపై రచ్చ తర్వాత అలీ తన మాటల్లో ద్వందార్ధాల ను కాస్త తగ్గించాడు.. ఆలీ మారిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ మొన్న జరిగిన 'ఊపిరి' ఆడియో ఫంక్షన్ లో అలీ మళ్ళి తన సహజ మాటల ధోరణి కంటిన్యూ చేసాడు.. ఆడియో వేడుకలో కాజల్ మాట్లాడిన తర్వాత వేదిక మీదకు వచ్చిన అలీ తనదైన శైలిలో కాజల్ పై సెటైర్లు వేశాడు. కాజల్ ఇంతకు ముందు చాలాసార్లు నాగార్జునని కలిసింది.. కానీ ఎప్పుడూ నాగార్జునని ఇంతగా పొడగలేదు. కానీ ఇప్పుడు కాజల్ ఎందుకు ఇంతగా పొగుతుందో తెలుసా.. అని నాగార్జునని ప్రశ్నిస్తూ మీకు కొత్తగా 50 కోట్లు వచ్చాయి కదా..! అందుకే కాజల్ పొగుడుతోంది. ఎంతపొగిడినా కాజల్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు, ఏమన్నా ఇస్తే అమలకు ఇవ్వండి అని అలీ వ్యాఖ్యానించగా.. కాజల్ అగర్వాల్ షాక్ అయ్యింది. అలీ కామెంట్స్ తో మొత్తం నవ్వులతో నిండిపోయింది. తర్వాత అలీ నాగార్జున గురించి మాట్లాడుతూ.. హిట్లు ప్లాపులతో సంబంధం లేని హీరో నాగార్జున అని ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలన్నాడు. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో అన్నమయ్య, రామదాసు లాగా మరో మైలు రాయి సినిమాగా మిగిలిపోతుందని అన్నాడు ఆలీ . అంతేకాదు.. నాగార్జున చేయిపడితే ఆడైనా, మగైనా పై పైకి వెళ్లడమే అంటూ అలీ పలికించిన హావభావాలను చూసి ఆడియో ఫంక్షన్ ని వచ్చిన వారు అలీ ఇంకా మారలేదు అని కామెంట్స్ చేశారనే టాక్స్ వినిపిస్తున్నాయి.
Tags
Film News
