తెలంగాణ CM KCR గారి మనుమడు, మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాంషు సూపర్ హీరోగా మారనున్నారు. ఓ షార్ట్ ఫిలింలో నటించనున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ఐక్యరాజ్యసమితి (ప్రపంచ పర్యాటక సంస్థ) ఆధ్వర్యంలో తెరకెక్కనుంది. దీనికి 6 దేశాలకు చెందిన వాళ్లు సూపర్ హీరోలుగా చేయనున్నారు. సమాజంలో జరిగే అవినీతికి, అక్రమాలు, మూఢాచారాలకు, వ్యతిరేకంగా ఆరు నిమిషాల నుండి పది నిమిషాల నిడివి ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో హిమాంషు కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణం లాంఛనంగా ప్రసాద్ లాబ్స్ లో ఈ రోజు ప్రారంభమైంది.
Tags
News

