High court cease Electric powersupply Employees allotments in Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. 1100 మందిని ఆంధ్రప్రదేశ్ కి సరెండర్ చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ట్రాన్స్ కో జారీచేసిన తుది జాబితాతోపాటు విద్యుత్ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ కొంత మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ( గురువారం) ఈ వ్యాజ్యాలపై జస్టిస్ ఆర్ కాంతారావు ఆధ్వర్యంలోని న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ట్రాన్స్ కో ఉద్యోగులను కేటాయించిందంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. ఐతే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడే విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు చెసినట్లు తెలంగాణ రాష్ట్ర ఏజీ కే రామకృష్ణారెడ్డి తన వాదనలను వినిపించారు.
