తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు
నిరుద్యోగులకు తీపి కబురు, ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఉద్యోగాల ప్రకటన విడుదల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి గుడ్ న్యూస్ అందించారు. రాబోయే వారంలో పలు ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. నారాయణగూడలో నవ తెలంగాణ పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన జీవోలకోసం వేచి చూస్తున్నామని రెండు, మూడు రోజుల్లో జీవోలు వచ్చేస్తాయని చెప్పారు.