గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా హీరో రామ్ ‘పండచేస్కో’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. చాలా కాలంగా హిట్స్ లేకపోవడంతో ఈ సినిమాతో హిట్ సాధించాలని హీరో రామ్ వెయిట్ చేస్తున్నాడు . ఈ సినిమాను మే 14న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
