ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని పేరును అధికారికంగా ప్రకటించారు . కొత్త రాజధాని పేరు "అమరావతి "గా ఖరారు చేస్తూ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామని, రాజధాని మాస్టర్ ప్లాన్ ను కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పాడు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగాపూర్ బృందం రూపొందించిందని, వచ్చే నెలలో కొత్త రాజధాని నిర్మాణానికి ఫౌండేషన్ వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపాడు.
