హిమాయత్‌నగర్ : ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది ! ఈ ఘటన హైదరాబాద్ హిమాయత్‌నగర్ ప్రాంతంలో బుధవారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన భ్రమరాంబిక (20) హిమాయత్‌నగరలోని హమ్స్‌టెక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తుంది. స్థానికంగా ఓ హాస్టల్‌లో నివాసం ఉంటుంది. బుధవారం సాయంత్రం హాస్టల్‌లోని తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.హాస్టల్ యజమాని ఇచ్చిన సమాచారంతో నారాయణగూడ పోలీసులు అక్కడకు చేరుకుని భ్రమరాంబికను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది