Revanth Reddy Resigns from TDP || Revanth Reddy Quits TDP ||టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా
అందరూ
అనుకున్నట్టే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. తెలంగాణ తెలుగు
దేశం పార్టీలో కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు రాజకీయాలను హీటెక్కించిన
విషయం తెలిసిందే. అయితే పార్టీ అధినేత చంద్రబాబు వచ్చేవరకూ రేవంత్ విషయంపై
సందిగ్ధం నెలకొంది. తాజాగా విదేశీ పర్యటనను ముంగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు
తెలంగాణ నేతలతో సమావేశం అయి రేవంత్ విషయంపై చర్చించారు. రేవంత్ కూడా ఆ సమావేశానికి
హాజరై అధినేతకు వివరణ ఇచ్చారు. అయితే అంతిమంగా పార్టీ విడాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.
అదే విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేసి.. తాను రాజీనామా
చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్.. అక్కడ కాంగ్రెస్
ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే.