ఆకాశ దీపం ప్రాముఖ్యత !! కార్తీక మాసంలో ఆకాశ దీపంఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?


ఆకాశ దీపం ప్రాముఖ్యత

ఆకాశ దీపం ప్రాముఖ్యత !! కార్తీక మాసంలో ఆకాశ దీపంఎందుకు వెలిగిస్తారు?

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?
కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపంవేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు.

ఆకాశ దీపం ప్రాముఖ్యత

తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు.

ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. దీపావళిరోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు



akasha deepam, about akasha deepam, akasha deepam importance, significance of akasha deepam, karthika masam, karthika masam special, karthika masam pooja vidhanam, karthika masam pooja, karthika masam 2017, karthika masam 2016, significance of karthika masam, karthika masam importance, Shubha Dinam, Archana, Sri Kakunuri Suryanarayana Murthy, Kakunuri Suryanarayana Preaches, Bhakthi, kakunuri suryanarayana murthy, Bhakthi 

Post a Comment

Previous Post Next Post

Contact Form