No Need Petrol CAR

పెట్రోల్ అక్కర్లేని కారు...ఇక దూసుకెళ్లండి.


ప్రపంచంలో పర్యావరణ కాలుష్యం జరుగుతుందంటే..కారణం ఒకటి కంపెనీలు వదిలే పొగ ..రెండోది వాహనాలు వదిలే పొగ. అయినా ఈ రెండు లేకుండా మనం ఉండలేము. ఈ రోజుల్లో  కారు లేనిదే కాలు బయటపెట్టలేము. మరి కాలుష్యం లేకుండా...కాలు కింద పెట్టకుండా బయటకి వెళ్లటం ఎలా....
దీనికోసమే  బ్యాటరీతో నడిచే వాహనాలు వచ్చాయి. కాని వాటికి ఉన్న పరిమితుల మూలంగా అంతగా క్లిక్ కాలే కపోయాయి. మొదటి సమస్య స్పీడు. దీనిని అధికమిస్తూ SRK  అనే అమెరికా  సంస్ధ చేసిన ప్రయోగం ప్రంపంచం మొత్తాన్ని తనవైపుకు ఆకర్షిస్తుంది. ౩ చక్రాలతో నడిచే ఈ వాహనం అచ్చం కారులా గా ఉంటుంది. ముందు ఒకరు, వెనక ఒకరు కుర్చోవచ్చు. ఎండొచ్చినా, వానొచ్చినా, ఇబ్బంది లేకుండా కప్పు ఉంటుంది. దీని స్పీడు గంటకు 137కి.మీ. ఈ కారుకి   లిథియం ఆయాన్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 113కి.మీ వరకు వెళ్తుంది. ఈ కారు ఖరీదు 8లక్షలు.

Post a Comment

Previous Post Next Post

Contact Form