I Phone ధరలు భారీగా తగ్గనున్నాయి. సంపన్నుల మొబైల్‌గా పేరున్న Apple Phone ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి రానుంది. మార్చి 22న ఆవిష్కరించనున్న I Phone SE (Special Edition) మోడల్ ప్రమోషన్‌లో భాగంగా Iphone 5S ధరను సగానికి సగం తగ్గించి అమ్మాలని ఆపిల్ కంపెనీ యోచిస్తోంది. యుఎస్‌లో ప్రస్తుతం Iphone 5S ధర 30 వేలకు పైగానే ఉంది. I Phone SE లాంచింగ్ తర్వాత ఈ ఫోన్ 15 వేలకే వినియోగదారులకు లభిస్తుంది . అయితే ఈ తగ్గింపు కేవలం అమెరికాలో తగ్గించిన కొద్ది రోజుల్లోనే ఇండియాలో కూడా తగ్గింపు ధరలను అమలు చేయాలని Apple company యోచిస్తోంది. Iphone SE మోడల్ ప్రమోషన్‌లో భాగంగానే ఇంత భారీ తగ్గింపును ప్రకటిస్తున్నట్లు టెక్ విశ్లేషకులు చెప్తున్నారు . US లోనే కాకుండా Indiaలో కూడా త్వరలోనే I phone ధరలు భారీగా తగ్గుతుందనే వార్తతో ఐ ఫోన్ అభిమానులు మార్చి 22 కోసం ఎదురుచూస్తున్నారు ఆపిల్ అభిమానులు .
Tags
News
