Telangana TET Notification 2016 Postponed
----------------------------------------------------------------------------------------------------
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TET పరీక్షను వాయిదా వేసింది. కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సూచనతో TET వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న TET పరీక్ష విధానం పై సమీక్ష చేయాలని కేంద్రం నిర్ణయించింది. 5గురు సభ్యులతో కమిటీ వేసి 3నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్రంలో మే 5 తర్వాత TET నిర్వహించే అవకాశముంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో DSC కి మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
