ఇప్పటి నుండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే… కోర్టుకు వెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రోజురోజుకి యాక్సిడెంట్లు పెరుగుతున్నందున తగ్గించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మార్చి 2 నుంచి లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే ఎవరైనా సరే అక్కడికక్కడే వాటిని స్వాధీనం చేసుకుంటారు. మరుసటి రోజు ఉదయం కోర్టుకి వాహనం నడిపిన వ్యక్తి తన ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని హాజరు కావాలి. నిజానికి మోటార్ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా ....... రవాణా శాఖ అధికారులు, పోలీసులు, వీటిని అవసరమై సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. అయితే బుధవారం నుంచి మాత్రం ఎవరినీ వదిలిపెట్టేదిలేదని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా విధిస్తామని అధికారులు గట్టిగానే చెబుతున్నారు.
ఇకపై శిక్షలు ఇలా ఉండబోతున్నాయి….
· లైసెన్సు లేకుండా మొదటిసారి పోలీసులకు పట్టుబడితే….
Ø వాహనం స్వాధీనం చేసుకుని మరుసటి రోజు కోర్టులో ఆ వాహన చోదకుడిపై అభియోగపత్రం దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తి అయ్యేవరకు వరకూ కోర్టులోనే ఉండి ఫైన్ కుడా కట్టిరావాలి.
· లైసెన్స్ లేకుండా రెండవ సారి పట్టుబడితే..
Ø ఒక రోజు జైలు శిక్ష.
48 గంటల పాటు జైలు శిక్ష పడితే విద్యార్థులకు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుందని పోలిసుల దూరదృష్టితో ఒక రోజుకు పరిమితం చేశారు.
· మూడవ సారి పోలీసులకు పట్టుబడితే..
Ø 2 రోజుల పాటు జైలు శిక్ష తో పాటు జరిమానా చెల్లించాలి.
· అయిదు, అంతకంటే ఎక్కువసార్లు పట్టుబడితే..
Ø 7 రోజులపాటు జైలు శిక్ష అనుభవించడంతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సివుంటుంది.
Tags
News
