నాగచైతన్య కాబోయే భార్య టాలీవుడ్ టాప్ హీరోయిన్ !
Naga Chaitanya to marry Tollywood / Kollywood top Heroine

నాగచైతన్య పెళ్లిపై గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. గతేడాది ఆయన పుట్టిన రోజుకే ఆ అమ్మాయిని రివీల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఎందుకో వాయిదా పడింది. అయితే, తాజాగా మరోసారి నాగచైతన్య పెళ్ళి ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నాగచైతన్య ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. అయితే, ఆమె ఎవరో కాదు.. Tollywood, Kollywood టాప్ హీరోయిన్ అని తాజాగా వినిపిస్తుంది. గతంలో వీరిద్దరూ కొన్ని సినిమాలలో నటించారు. అటు చైతు నాన్న నాగార్జునకి కూడా ఆ అమ్మాయితో మంచి అనుబంధం ఉంది. అందుకే, చైతు ఆమెని పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత మొదట నాగార్జున చిన్న చిన్న అభ్యంతరాలు చెప్పినా.. ఫైనల్‌గా ఓకే చేశారని సమాచారం.
నాగార్జున-అమలది ప్రేమ వివాహం. అమల కూడా హీరోయిన్. అందుకే, చైతు ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే, అక్కినేని కుటుంబం ఓకే చెప్పిందట. గతేడాదే ఆ హీరోయిన్ని అక్కినేని ఇంటికి కాబోయే కోడలిగా పరిచయం చేద్దామని ప్లాన్ చేసినా.. కొంత టైమ్ తీసుకుందామనుకున్నారట. రీసెంట్‌గా అన్నీ ఫైనలైజ్ కావడంతో త్వరలోనే దీనిపై అక్కినేని కుటుంబం నాగచైతన్య- ఆ హీరోయిన్ మ్యారేజ్‌పై ఓ అనౌన్స్ చేస్తారట. ఈ సమ్మర్ లోనే ఆ గుడ్ న్యూస్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి, ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరనేదే ఆసక్తిగా చూస్తున్నారు .