Gujarat Village Bans Mobile for School Girls | Gtv Telugu News

                     అక్కడ అమ్మాయిలు ఫోన్ వాడోద్దంట !!
       Gujarat village Panchayat  bans mobile phones for school Girls


అమ్మాయిలు ఫోన్లు యూజ్ చేస్తే ఫైన్ తప్పదు !!

గుజరాత్  రాష్ట్రంలోని సూరజ్ గ్రామంలో అమ్మాయిలు ఫోన్లు యూజ్ చేయడాన్ని బ్యాన్ చేశారు. మైనర్స్ మొబైల్ ఫోన్లు వాడొద్దని  ఈ నిబంధనను అతిక్రమిస్తే ఫైన్  కట్టాల్సి  వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని మెహన్సా జిల్లాలోని సూరజ్ అనే గ్రామంలో చదువుకుంటున్న అమ్మాయిలు  ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు ఉపయోగించరాదని  వాటిని ఉపయోగించడం వాల్ల  వారి ప్రవర్తన లో మార్పు , చదువులపై ఎఫెక్ట్  పడుతుందని గ్రామ సర్పంచ్ ప్రతిపాదించారు. దీనికి ఆ గ్రామ పంచాయతీ అందరూ ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఒక వేళ ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.2100 ఫైన్ చెల్లించాలని తెలిపారు . మొబైల్ ఫోన్లు అమ్మాయిలకు, వారి పేరెంట్స్ కు  సమస్యలుగా మారాయని… వీటి కారణంగా అమ్మాయిలు తేలిగ్గా ప్రేమ  మాయలో పడటమే కాకుండా ఇంట్లో నుంచి  వెళ్లిపోతున్నారని ఆ గ్రామస్తులు అంటున్నారు. అందుకే తాము తెచ్చిన ఈ ప్రతిపాదనకు  ప్రజలందరూ  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు.

Post a Comment

Previous Post Next Post

Contact Form