విద్యార్థినితో లాడ్జిలో పట్టుబడ్డ కిచక టీచర్ !!
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పట్ల కీచకుని గా మారాడు. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఓ లాడ్జీలో 10th class విద్యార్థినితో ఉపాధ్యాయుడు పట్టుపడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి విద్యార్థినికి మాయామాటలు చెప్పి సూర్యాపేటకు తీసుకొచ్చాడు. అనంతరం ఓ లాడ్జీకి విద్యార్థినిని తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్తా పోలీసుల దాకా చేరింది. పోలీసులు లాడ్జీ దగ్గరికి చేరుకొని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు, అనంతరం విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఉపాధ్యాయుడి పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
